హైదరాబాద్: నటుడు బాలకృష్ణ ప్రవర్తన కాస్త అతిగా ఉంటుంది. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో బాలకృష్ణ నటి అంజలిని తోసేశాడు. ఆమె తుళ్లి పడిపోయేదే. కానీ నిలదొక్కుకుంది. కానీ తర్వాత సర్దుకుని ఏడ్వలేక నవ్వేసింది. అయినా కొందరు బాలకృష్ణ తీరు సరైనదేనన్నట్లు వ్యాఖ్యానించారు. కానీ గాయని చిన్మయి శ్రీపాద ఆ వీడియోను సోషల్ మీడియాలో గురువారం షేర్ చేసి దులిపి పారేసింది. ‘ అధికార మదం ఎక్కిన కొందరు ఇతరులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు’ అని వ్యాఖ్యానించింది. ఆ వీడియో మీరు కూడా చూసి తప్పొప్పులు నిర్ణయించుకోండి.
కృష్ణ చైతన్య రాబోవు చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషనల్ ఈవెంటెలో నటుడు బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా వచ్చి దురుసుగా వ్యవహరించాడు. స్టేజి మీద ఆయన ప్రక్కన నేహా శెట్టి, అంజలి నిలుచున్నారు. బాలకృష్ణ జరుగు జరుగు అంటూ అంజలిని తోయడం, తర్వాత అసహనంగా గట్టిగా తోసేయడం జరిగింది. పాపం అంజలి తుళ్లిపడిపోబోయింది. కానీ తర్వాత నిలదొక్కుకుని.. సర్దుకుని ఏమి జరగనట్టు నవ్వుతూ వ్యవహారాన్ని సర్దేసింది.
ఆ సినిమాలో సహ నటుడయిన విశ్వక్ సేన్, నిర్మాత నాగ వంశీ అదేమి పెద్ద విషయం కాదని బాలకృష్ణ తరఫున సర్దిచెప్పారు. పైగా బాలకృష్ణ ప్రవర్తన సరైనదే అన్నట్టు ప్రెస్ మీట్ లో చెప్పారు. పైగా వారిద్దరూ బాలకృష్ణ ఉత్తమోత్తముడని కీర్తించారు. బాలకృష్ణకు అసహనం ఎక్కువని ఈ ఘటనే కాదు, ఇంతకు ముందు జరిగిన అనేక ఘటనలు కూడా రుజువుచేశాయి. ఇంత వయసొచ్చాక కాస్త సహనం పెంచుకునే వైఖరి కూడా బాలకృష్ణలో కనపడ్డం లేదు. అతడి హోదాకు ఇతరులు గడ్డిపోచలా కనబడుతున్నారేమో.
నటుడు నకుల్ మెహతా కూడా బాలకృష్ణ తీరును ఖండించారు.
One of the biggest problems that I notice from people sharing this
“Look at her laughing. She should have _____”1. It is NOT possible to respond according to your spectator response as you watch this on your device. This most moral policing, holier than thou – pure as driven… https://t.co/nzTOlGJm0J
— Chinmayi Sripaada (@Chinmayi) May 30, 2024