Monday, December 23, 2024

ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ లు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో అభ్యంతరకర ట్వీట్ చేసినందుకే కన్నడ నటుడు చేతన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ సహా మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలను ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బహుశా తాము కూడా కర్ణాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే అబ్యూస్ చేసే హక్కు ఉన్నట్లు కాదని చెప్పారు.
అసలీ చేతన్ ఎవరు, ఏం చేశాడు?
చేతన్ సోమవారం రోజు ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ట్వీట్ రెండు వర్గాల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందన్న అభియోగాలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చేతన్ దళిత, గిరిజనుల హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు.

ఈయన వివాదాల్లో నిలవడం ఇదే మొదటి సారి ఏంకాదు. 2022 ఫిబ్రవరిలోనూ హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్‌పై అభ్యంతరక ట్వీట్ చేసి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News