Sunday, December 22, 2024

విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు, ఇద్దరు కుమార్తెలు మృతి

- Advertisement -
- Advertisement -

కింగ్స్‌టౌన్: కారిబియన్ సముద్రంలో శుక్రవారం ఒక ప్రైవేట్ విమానం కూలిపోయిన దుర్ఘటనలో జర్మన్ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్, ఆయన ఇద్దరు కుమార్తెలు మరణించారు. కారిబియన్‌లో భాగమైన సెయింట్ విన్సెంట్, గ్రెనదైన్స్‌లో భాగమైన పేజెట్ ఫామ్ నుంచి సమీపంలో ఉన్న సెయింట్ లూసియా అనే మరో దీవికి బయల్దేరిన ఆలివర్‌కు చెందిన సింగిల్ ఇంజన్ విమానం కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఇది రగడానికి కొద్ది రోజుల ముందే తాను ఏదో స్వర్గం నుంచి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆలివర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

విమానం సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిన వెంటనే కోస్తా గార్డు అధికారులు పేజెట్ ఫామ్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సముద్రంలో నుంచి ఆలివర్(51), ఆయన కుమార్తెలు మదిత(10), అన్నిక్(12) మృతదేహాలతోపాటు విమాన పైలట్, విమాన యమజాని మృతదేహాలను కూడా వెలికితీశారు. విమాన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా క్రిస్టియన్ ఆలివర్ 60కి పైగా సినిమాలు, టివి షోస్‌లో నటించారు. ఆయననటించిన వాల్క్‌ఐరీ, ది బేబీ సిట్టర్స్ క్లబ్ టివి షోలు, సెన్స్ 8 టీవీ సిరీస్ జనాదరణ పొందాయి. జార్జ్ క్లూనీతో కలసి ఆయన ది గుడ్ జర్మన్, స్పీడ్ రేసర్ వంటి చిత్రాలలో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News