Monday, December 23, 2024

దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు వైద్య కారణాలపై కర్నాటక హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెన్నెముక సర్జరీ కోసం దర్శన్‌కు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 11న అరెస్టయిన దర్శన్ ప్రస్తుతం బళ్లారి కారాగారంలో ఉన్నారు.

దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరులోని సుమనహల్లిలోని ఒక అపార్ట్‌మెంట్ పక్కన మురుగు కాల్వలో లభించింది. దర్శన్ స్నేహితురాలైన నటి పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్‌లను పంపించాడన్న కోపంతో రేణుకాస్వామిని అతని ఇంటి నుంచి తీసుకువచ్చి హత్య చేసినట్లు దర్శన్, అతని అనుచరులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో పవిత్ర గౌడ కూడా సహ నిందితురాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News