Wednesday, September 18, 2024

నటుడు దర్శన్ బళారి జైలుకు తరలింపు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో నిర్బంధంలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను, ఇతర నిందితులను, రౌదీ శక్తులను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నుంచి బళ్లారి జైలుకు మార్చాలని కోరుతూ జైలు అధికారులు చేసిన విజ్ఞప్తిని బెంగళూరు కోర్టు మంగళవారం అనుమతించింది. ఇదే కేసులోని ఇతర నిందితులను కూడా బళారి జైలుకు తరలించడానికి కోర్టు అనుమంతించింది.జైలు అధికారులు చేసిన విజ్ఞప్తిని అనుమతిస్తూ 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

కాగా..అంతకుముందు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద విలేకరులతో మాట్లాడుతూ దర్శన్‌తోపాటు ఇతర నిందితులను వేరే జైలుకు నగర పోలీసులు కోరినట్లు వెల్లడించారు. జైలు లాన్స్‌లో ఒక రౌడీ షీటర్‌తో సహా ముగ్గురితో కలసి దర్శన్ ఉల్లాసంగా ఉన్న చిత్రం ఒకటి ఆదివారం సామాజిక మాధ్యమంలో కనిపించి వివాదానికి దారి తీసిన నేపథ్యంలో నగర పోలీసులు ప్రతిపాదన చేశారు. ఆ చిత్రంలో దర్శన్ ఒక సిగరెట్, కాఫీ మగ్ పట్టుకుని ఒక కుర్చీలో చిద్విలాసంగా కూర్చుని ఉండడం కనిపించింది. దర్శన్ జైలులో నుంచి ఒక వ్యక్తితో వీడియా కాల్‌లో మాట్లాడుతున్నట్లుగా భావిస్తున్న ఒక వీడియో కూడా సామాజిక మాధ్యమంలో వెలుగు చూసింది.

ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌కు రాజభోగాలు అందిస్తున్నట్లు ఆరోపణలు రాగా చీఫ్ జైలు సూపరింటెండెంట్ సహా తొమ్మిది మంది జైలు అధికారులను దర్యాప్తు అనంతరం సస్పెండ్ చేశారు. దయానంద బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, జైలులో సంఘటన సందర్భంగా మూడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒక కేసును ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, మరి రెండింటిని ఇన్‌స్పెక్టర్లు దర్యాప్తు చేస్తారని ఆయన తెలిపారు. కేసుల గురించి దయానంద మాట్లాడుతూ, జైళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు అనుమతి అవసరమని, సమగ్ర దర్యాప్తు నిమిత్తం ఆ అనుమతి పొందే యత్నంలో పోలీసులు ఉన్నారని, జైళ్ల చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసుల నమోడు జరిగిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News