Wednesday, January 22, 2025

నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్(80) కన్నుమూశారు. వృద్ధాప్యంతోపాటు గతకొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి ఆయన మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా కమల్ హాసన్, సూపర్‌స్టార్ రజినీకాంత్, విజయకాంత్ వంటి ప్రముఖ హీరోల చిత్రాలలో ఆయన నటించి అలరించారు. పలు కామెడీ పాత్రల్లోనూ నటించారు. తమిళ్ లోనే కాకుండా తెలుగు, మలయాళంతోపాటు ఇతర భాషల్లో దాదాపు 400లకు పైగా సినిమాల్లో ఢిల్లీ గణేష్ నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News