గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా హీరో గీతానంద్ చెప్పిన విశేషాలు.
“ఇదొక యూనిక్ స్టోరీ. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నించాం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ మా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. మేమిద్దరం కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. తమ్ముడు స్టోరీ రాస్తే నేను యాక్ట్ చేసే వాడిని.. లేదంటే వాడి స్టోరీను నేను డైరెక్ట్ చేసే వాడిని. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ తో పాటు సింక్ ఉండేది. ఈ సినిమా విషయంలో మాకు ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. రియల్ టైం సైకలాజికల్ గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉంటాయి.
నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపిస్తుంది. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఆదిత్య మీనన్ గారు, ఇందులో నటించడం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మధుబాల గారు ఇప్పటివరకు కనిపించని కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఇందులో క్రేజీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రేక్షకులు ఎవరు ఊహించలేరు అనేంతగా ఉంటుంది. ఆదిత్య మీనన్ గారు గ్రేషేడ్ లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్ గారు మా తాత పాత్రలో ఇన్స్పైరింగ్ రోల్ చేశారు.ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా మిక్సింగ్ అంతా చెన్నై లోని ఏఆర్ రెహమాన్ గారి స్టూడియోలో జరిగింది. థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్ ఉంటుంది. టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకున్నాం. నిర్మాత రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం కలిసి చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. అందుకే విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. పాటలు చాలా రిచ్ గా ఉంటాయి. ప్రతి క్రాఫ్ట్ ను నేను కూడా చూసుకోవడంతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది.
గత మూడు రోజులుగా వేస్తున్న ప్రీమియర్స్ కి మంచి స్పందన వస్తుంది. యంగ్ ఏజ్ నుంచి పెద్దవాళ్ల వరకు షోస్ వేశాం. అందరి దగ్గర నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు సినిమా చూసి ఎక్సైట్ అయ్యారు. అలాగే రిలీజ్ కి ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. సీక్వెల్ కోసం వేరే ప్లానింగ్ అయితే ఉంది. ఈ సినిమాకు వచ్చే రియాక్షన్ ను బట్టి అది ప్రకటిస్తాం. అలాగే మూడు కొత్త కథలు విన్నాను అవి కూడా త్వరలో ప్రకటిస్తా” అని చెప్పారు.
గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్, అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః నవాబ్ గ్యాంగ్, అశ్విన్ – అరుణ్, సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, స్క్రిప్ట్ సూపర్ వైజర్: విజయ్ కుమార్ సి.హెచ్, ఎడిటర్: వంశీ అట్లూరి, ఆర్ట్ః విఠల్, యాక్షన్ కొరియోగ్రఫీః రామకృష్ణ. నభా స్టంట్స్, స్టైలింగ్ః దయానంద్, పిఆర్ఓః జి.కె మీడియా, కొరియోగ్రఫిః మోయిన్, నిర్మాత: రవి కస్తూరి, కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్: దయానంద్.