Monday, January 20, 2025

బాలీవుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలు…ఆసుపత్రిలో చేరిక!

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, శివసేన నాయకుడు గోవింద(60)కు మంగళవారం తన ఇంట్లోనే అనుకోకుండా బుల్లెట్ గాయాలయ్యాయి. దాంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ప్రమాదం లేదు. అతడి మోకాలికి బుల్లెట్ గాయమయింది.

గోవింద మేనేజర్ శశి సిన్హా కథనం ప్రకారం, ‘‘గోవింద కోల్ కతాకు వెళ్లబోతుండగా, అతడి రివాల్వర్ తన చేతిలో నుంచి కింద పడిపోయింది. దాంతో అనుకోకుండా అది పేలి ఆయన మోకాలికి గాయమైంది. ప్రస్తుతం డాక్టర్లు అతడి మోకాలి నుంచి బుల్లెట్ ను తొలగించారు. ఆయన పరిస్థితి కూడా సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు’’ అని తెలిపారు. గోవింద ప్రస్తుతం క్రిటికేర్ హాస్పిటల్ లో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News