Monday, December 23, 2024

శివసేనలో చేరిన నటుడు గోవింద

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోవింద బిజెపి అగ్రనేత రాం నాయక్‌పై విజయం సాధించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన గోవింద్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత పక్షం రోజులలో పలుమార్లు షిండేను కలుసుకున్న 60 ఏళ్ల గోవింద చివరకు శివసేనలో చేరారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని గోవింద తెలిపారు.

14వ లోక్‌సభలో సభ్యుడినైన తాను 14 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని గోవింద తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, అభివృద్ధి రాజకీయాల పట్ల స్ఫూర్తి పొంది గోవింద తమ పార్టీలో చేరారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండా ఆయన శివసేనలో చేరారని షిండే చెప్పారు. 150కి పైగా హిందీ చిత్రాలలో నటించిన గోవింద ఆహుజ గత కొన్నేళ్లుగా చిత్ర సీమకు సైతం దూరంగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News