- Advertisement -
మంగళూరు! యక్షగానాన్ని ప్రదర్శిస్తూ గురువప్ప బయర్(58) అనే నటుడు గురువారం రాత్రి రంగస్థలంపైనే కుప్పకూలి మరణించాడు. ఫోర్త్ కటటీల్ మేళా అనే సంస్థ ఆధ్వర్యంలో కటీల్ ఆలయంలోని సరస్వతిసాదనలో గురువారం రాత్రి త్రిజన్మ మోక్ష అనే యక్షగానాన్ని ప్రదర్శిస్తుండగా శిశుపాలక పాత్రధారి గురువప్ప స్టేజీ పైనే కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అష్టమంగళ యక్షగాన ప్రసంగం రచించిన గురువప్ప కొద్ది రోజుల క్రితం దీన్ని మంగళూరులోని టౌన్ హాలులో ప్రదర్శించారు. అనేక యక్షగాన మేళాలలో నటించిన ఆయన 2013లో కటీల్ మేళలో చేరారు.
- Advertisement -