Monday, December 23, 2024

నటి జమున కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటి జమున(86) కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు.  తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో జమున  నటించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు జమున భౌతిక కాయం ఫిల్మ్ చాంబర్‌కు తీసుకరానున్నారు.   నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి అనే దంపతులకు 1936 ఆగస్టు 30న కర్నాటకలోని హంపీలో జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జమున ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.

సినిమాల్లోకి రాకముందు జమున పేరు జానాభాయిగా ఉండేది.  జ్యోతిషుల సూచనతో కుమార్తె పేరును జమునగా తల్లిదండ్రులు మార్చారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి నియోజక వర్గం నుంచి 1989లో ఎంపిగా గెలిచారు. 1991 లోకసభ ఎన్నిలలో ఓడిపోవడంతో రాజకీయాల నుంచి వైదొలిగారు. 1990లో అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో బిజెపి తరుపున జమున ప్రచారం చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు మిలాన్ సినిమాలో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News