Thursday, January 9, 2025

కెపి చౌదరితో కాల్స్… ఎలాంటి టెస్టుకైనా నేను రెడీ: నటి జ్యోతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెపి చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డ్రైవ్‌లో కెపి చౌదరీ డేటాను పోలీసులు సేకరించారు. సైబరాబాద్ పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు. కెపి చౌదరి నిర్మాత కాబట్టి ఫోన్‌లో మాట్లాడం సహజమని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సినీ ప్రముఖులు అంటున్నారు. కెపి చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఎలాంటి టెస్టుకైనా రెడీ ఉన్నానని స్పష్టం చేశారు. కెపి చౌదరితో ఫ్యామిలీ బాండింగ్ తప్ప ఏ సంబంధం లేదని జ్యోతి స్పష్టం చేశారు. సిక్కిరెడ్డి ఇంట్లో జరిగిన ఏ పార్టీకి తాను వెళ్లలేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు. తన ఫోన్ కావాలన్న పోలీసులకు ఇస్తానని స్పష్టం చేశారు. డేటా రిట్రీవ్ చేసుకున్నా తనకు అభ్యంతంర లేదన్నారు.

Also Read: వర్మను బట్టలూడదీసి కొడుతాం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News