- Advertisement -
హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కైకాల ఆరోగ్యం గురించి ఆయన కుటుంబసభ్యులను ఆడిగి తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఇటీవల ఆయన తన ఇంట్లో జారిపడడంతో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాగా, వయసు పైబడడంతో ఆయన సినిమాల్లో నటించడం తగ్గించారు. చివరగా ఆయన ‘యన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ సనిమాల్లో నటించారు.
Actor Kaikala Satyanarayana admit in Hospital
- Advertisement -