Thursday, January 23, 2025

ఏపి సిఎంకు కైకాల కృతజ్ఞతలు..

- Advertisement -
- Advertisement -

గత ఏడాది నవంబర్‌లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్‌లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. “బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధ పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తినిచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల, వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది” అని అన్నారు.

Actor Kaikala Satyanarayana thanks to AP Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News