Monday, December 23, 2024

గగన్‌యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్‌ను పెళ్లి చేసుకున్నా:నటి లెనా

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : మలయాళం నటి లెనా గగన్‌యాన్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను వివాహం చేసుకున్నారు. నటి ఆ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. వారు జనవరి 7న వివాహం చేసుకున్నారు. గ్రూప్ కెప్టెన్ నాయర్ భారత వైమానిక దళం (ఐఎఎఫ్)లో టెస్ట్ పైలట్. గగన్‌యాన్ యాత్ర కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాములలో ఒకరుగా గ్రూప్ కెప్టెన్ నాయర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని గంటలకే తాను ఆయనను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో గర్వంగా ప్రకటించారు. తన భర్త ప్రశాంత్ నాయర్‌తో తాను దిగిన ఫోటోను లెనా పంచుకుంటూ ‘ఈరోజు ఫిబ్రవరి 27న మన ప్రధాని మోడీజీ తొలి భారతీయ వ్యోమగామి వింగ్స్‌ను ఆయనకు ప్రదానం చేశారు’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News