Monday, December 23, 2024

సిఎం సహాయనిధికి నటుడు మహేశ్ బాబు రూ. 50 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిసారు. మహేశ్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపార నష్టం వాటిల్లింది,  పంటలు నీటమునిగాయి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. దీంతో పునరావాస కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృతంగా కృషిచేస్తోంది,  అంతేకాకుండా విపత్తు నుంచి బయటపడేందుకు సాయం అందించాలని కోరింది.

విపత్తు సమయంలో పునరావాస కార్యక్రమాలకు, సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వరద సహాయాన్ని అందించేందుకు మహేశ్ బాబు సైతం తనవంతుగా స్పందించారు. వరదల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మహేశ్ బాబు నమ్రతా శిరోద్కర్ దంపతులు… రేవంత్ రెడ్డిని కలిసి రూ.50లక్షల చెక్కును అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News