- Advertisement -
హైదరాబాద్: యంగ్ హీరో ముంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ సూర్య దర్శకత్వంలో ‘జిన్నా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఓ సాంగ్ షూటింగ్‌లో భాగంగా గాయం అయ్యిందని, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్ల అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం విష్ణు షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
- Advertisement -