Sunday, December 22, 2024

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

దుర్గ్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్‌పుత్ అత్యాచారం కేసులో శనివారం అరెస్ట్ అయ్యాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని 29 ఏళ్ల బాధితురాలైన దగ్గరి బంధువు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్‌లు దుర్గ్ జిల్లా లోని రాజ్‌పుత్ ఆఫీస్‌లోనే అరెస్ట్ చేశారు. ఈ నెల 22న బాధితురాలు ఓల్డ్ భిలాయి రైల్వే పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ముందుగానే తనతో లైంగికంగా 2011 నుంచి కార్యకలాపాలు సాగించడం ప్రారంభించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అయితే మాట ప్రకారం పెళ్లి సంగతి ఎత్తకపోవడంతో ఆమె పోలీస్‌లను ఆశ్రయించిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్‌కుమార్ బోర్ఝా చెప్పారు. అత్యాచారం, అసహజ లైంగిక కార్యకలాపాలు, నేరపూరిత బెదిరింపులు, ఇతర నేరాల కింద అతనిపై కేసు దాఖలైంది. బాధితురాలిపై లైంగిక దాడి ప్రారంభమైనప్పుడు మైనర్ కావడంతో పోక్సో చట్టాన్ని కూడా నిందితుడిపై నమోదు చేశారు. స్థానిక కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా, 2011లో పోక్సో చట్టం లేదని, స్థానిక కోర్టు పోక్సో నిబంధనలను రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News