Monday, December 23, 2024

మనోజ్‌కు రిమాండ్ విధించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో: శామీర్‌పేట కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న నటుడు మనోజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో స్మితా భర్త సిద్ధార్థ్ దాస్‌పై ఎయిర్ గన్‌తో నటుడు మనోజ్ శనివారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. భర్తతో విడిగా ఉంటున్న స్మితా, మనోజ్‌తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే పిల్లలను చూసేందుకు స్మిత ఉంటున్న సెలబ్రిటీ రిసార్ట్‌కు వెళ్లిన భర్త సిద్ధార్థ్ దాస్‌పై మనోజ్ ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మనోజ్‌ను అరెస్టు చేసి అల్వాల్‌లో జడ్డి ఎదుట హాజరుపర్చారు. కోర్టు మనోజ్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఆర్మ్ యాక్ట్ కింద మనోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News