Saturday, July 6, 2024

సైబర్ క్రైం పోలీసులకు మోహన్‌బాబు ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

Actor Mohan Babu Complain to Cyber Crime Police

మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని సినీనటుడు మోహన్‌బాబు నగర సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఉన్న తన వీడియోలపై వ్యక్తిగతంగా దూషిస్తూ మెసేజ్‌లు పెడుతున్నారని, అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. భూతులు కామెంట్ల రూపంలో వీడియోలు చేసి పోస్టింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మోహన్‌బాబు న్యాయసలహాదారు సంజయ్ సైబర్ క్రైం పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Actor Mohan Babu Complain to Cyber Crime Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News