Friday, December 20, 2024

మీడియాపై చిందులేసిన సినీ హీరో మోహన్‌బాబు

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: సినీ హీరో మోహన్‌బాబు మీడియాపై విరుచుకు పడ్డారు. గురువారం మధ్యాహ్నం షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మీడియా మిత్రులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సినీ నటుడు మోహన్‌బాబు కార్యాలయంలో తన కార్యక్రమాలను ముగించుకొని బయటకు వస్తున్న క్రమంలో కొంతమంది మీడియా మిత్రులు లోగోలు పెట్టేందుకు యత్నించగా అంతలోనే మోహన్‌బాబు అక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కవరేజ్ చేసేందుకు వెళ్ళిన మీడియాపై విరుచుకు పడటంతోపాటు చిందులు వేశారు.

మీడియా ప్రతినిధులకు బుద్ది లేదా అంటూ నోటికి ఒక్కసారిగా పని చెప్పారు. ఈ వ్యవహరం మీడియా దృష్టి పడకుండా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మోహన్‌బాబు చేరుకొని తన ఆస్తికి సంబంధించిన వీలునామా కోసం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు యత్నించగా అక్కడ ఉన్నవారు ఏమి జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. దాంతో మీడియా అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా చిందులు తొక్కి తన బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్దాంతం అయిందని చెప్పవచ్చు. ఏది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News