- Advertisement -
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని నివాసం వద్ద కవరేజ్ కోసం వచ్చిన ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం 10.30గంటలకు విచారణ హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి.. పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు ఇస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. తదిపరి విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.
- Advertisement -