Wednesday, November 13, 2024

వాయనాడ్ లో పర్యటించి పరిస్థితి తెలుసుకున్న నటుడు మోహన్ లాల్

- Advertisement -
- Advertisement -

మెప్పాడి(కేరళ): మలయాళం నటుడు మోహన్ లాల్ వాయనాడ్ లో శనివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో సైన్యం అందిస్తున్న సేవలను అభినందించారు. ఆయన నేడు టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్ చేరుకున్నాక మీడియాతో మాట్లాడారు. ‘‘ విషాధ ఘటన స్థలికి చేరుకున్నాకే ఎంత అపార నష్టం జరిగిందన్నది తెలుస్తుంది. రిలీఫ్ వర్క్ లో తోడ్పడుతున్న సైనికులు, ఇతర స్వచ్ఛంద కార్యకర్తలకే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రాంతంలో పునరావాస కార్యక్రమాలకు మేము మా విశ్వశాంతి ఫౌండేషన్ నుంచి రూ. 3 కోట్లు విరాళం ఇస్తున్నాము’’ అని మోహన్ లాల్ తెలిపారు. ఆయన టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కూడా పనిచేస్తున్నారు.

మోహన్ లాల్ సైనిక అధికారులతో చర్చించాక, ముండక్కయ్, పున్చిరిమట్టం ప్రాంతాల్లో పర్యటించారు. కొండచరియలు విరిగిపడ్డంతో ఆ ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. నటుడి వెంట మేజర్ రవి కూడా వెళ్లారు. మోహన్ లాల్ 122 ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో భాగం. ఆయన కొజికోడ్ నుంచి వాయనాడ్ కు పర్యటించారు. అంతేకాక సైనికాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News