కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే గోవాలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో సెకండ్ షెడ్యూల్‌ను మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో బుధవారం నుంచి రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాలలో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాల షూట్‌ను ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఎంటర్టైనింగ్, యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపిస్తాడని తెలిసింది. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇంతముందు చేయని పాత్ర పోషిస్తోందని టాక్. కాగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.