Friday, December 27, 2024

పాత జ్ఞాపకాలు మరువలేనివి: నటుడు నాగార్జున

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః నగరంలోని పేరుగాంచిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లినప్పుడు జాగీర్దార్ బ్లాక్ మెట్లు ఎక్కేటప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఈపాఠశాల వ్యక్తిత్వాన్ని నేర్పిందని సినీ నటుడు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. బుధవారం బేగంపేటలోని హెచ్‌పిఎస్ వందేళ్ల వేడుకలకు సంబంధించిన లోగో, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రపంచాన్ని ఎదుర్కొడానికి స్కూల్ నాకు ఆత్మ విశ్వాసం నేర్పిందన్నారు. అప్పట్లో స్కూలో ముగ్గురం మిత్రులం జామకాయలు కోయడానికి గోడ దూకేవాళ్లమని గుర్తించి ప్రిన్సిపాల్ శ్రద్దగా చదువుకోవాలని హెచ్చరించనట్లు చెప్పారు. హెచ్‌పిఎస్ పూర్వ విద్యార్ధి అయినందుకు సంతోషంగా ఉందని, పలు దేశాలు వెళ్లిన తమ స్కూల్ స్నేహితులు కలుస్తారని వెల్లడించారు.

ఏడాది పోడువునా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటే బాగుంటుందన్నారు.అనంతరం సమాచారం సాంకేతిక, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రసంగిస్తూ రాబోయే 50 సంవత్సరాల కోసం ప్రణాళికను అభివృద్ది అతి తేలికైన పనికాదు, అది హెచ్‌పిఎస్ చేసిందని పాఠశాల అద్బుతమైన విజయాలు సాధించినందని ప్రశంసించారు. ఇక్కడ చదవే విద్యార్థులు స్కాలర్‌షిప్‌పై వస్తారని, ప్రతి సంవత్సరం వెయ్యిమంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతారని చెప్పారు. ఈకార్యక్రమంలో స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా, ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవ్ దేవ్ సరస్వత్, స్కూల్ గవర్నర్ల బోర్డు వైస్ చైర్మన్ ఆర్.రఘరామ్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News