Monday, December 23, 2024

గీతా మాధురి భర్త నందుకు గాయాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఒకరు తరువాత ఒకరు చనిపోతుండడంతో తెలుగు పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ రాజుతో మొదలు పెట్టి వాణి జయరాం వరకు మరణించారు. సమంత, అనుష్కకు వింత వ్యాధులు సోకాయి. లోకేష్ పాదయాత్రలో నటుడు తారకరత్న కూడా నడుచుకుంటూ కూలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయని గీతా మాధురి భర్త, నటుడు నందు గాయపడినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. నందు పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించారు. నచ్చిన పాత్ర చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన కాలు గాయమైనట్టు తన ఇన్ స్టా గ్రామ్‌లో ఫోటో షేర్ చేశాడు. తన కాలికి గాయమైనా, నడవలేని స్థితిలో ఉన్నా డబ్బింగ్ చేప్పేందుకు నందు స్టూడియోకు వచ్చిన ఫోటో సోషల్ మైడియాలో వైరల్ కావడంతో అతడికి ఏమైందని అభిమానులు అడుగుతున్నారు. నందు ప్రస్తుతం సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబి28, ఆర్‌సి15, డిజె టిల్లు2, హరిహరమల్లు, ధాస్‌కీ ధమ్కీ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News