ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా అలియాభట్ నటిస్తోంది. పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న మరో క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. భన్సాలీ మరోసారి అద్భుతమైన ప్రేమ కథను వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాడట. తాజాగా ఇదే సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా భాగం చేయాలని భన్సాలీ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దింపాలని ప్రయత్నం చేస్తున్నాడట. సినిమాలో నానికి హీరోయిన్ కూడా ఉంటుందట. ఇక కథలో భాగంగా భార్య భర్తల పాత్రలు పోషిస్తారట. ఈ జోడికి కూడా ప్లాష్ బ్యాక్‌లో ఓ లవ్ స్టోరీ ఉంటుందట. ఈ పాత్రలకు బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కంటే సౌత్ వాళ్లు అయితే పక్కాగా ఉంటారనే ఆలోచనలో భాగంగా నాని పేరు తెరపైకి వచ్చింది. అలాగే హీరోయిన్ గా కూడా సౌత్ భామనే తీసుకోవాలనుకుంటున్నారట. మరి నాని ఈ సినిమాలో నటిస్తాడా, లేదా అనేది చూడాలి.
బాలీవుడ్ లవ్ స్టోరీలో నాని?
- Advertisement -
- Advertisement -
- Advertisement -