Wednesday, January 22, 2025

కెరీర్‌లోనే ‘ది బెస్ట్’ రోల్ చేశా

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాని తండ్రిగా నటించిన నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను పోషించిన నాని తండ్రి పాత్ర నా కెరీర్‌లో ‘ది బెస్ట్’ అని చెప్పగలను. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దర్శకుడు సినిమాను రూపుదిదిద్దన విధానం, రెండోది నాని, నాకూ మధ్య కామెడీ టైమింగ్. ఈ సినిమా తర్వాత నెక్స్ లెవెల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సి ఉంటుంది. గతంలో నేను జంధ్యాల సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రలు చేశాను. ఆతర్వాత ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి పాత్ర చేశాను. బ్రాహ్మణుడి పాత్ర కోసం బరువు తగ్గాను. మేకోవర్ మార్చుకున్నా. ఇక ప్రస్తుతం నేను లీడ్ రోల్స్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను”అని అన్నారు.

Actor Naresh About ‘Ante Sudaraniki’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News