నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్‌ఎఎస్‌డిపి), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్‌సిఎహెచ్‌ఆర్), యుఎన్‌ఒ ముఖ్యమైన విభాగం ఎన్‌ఎటిఓతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్. యుఎస్‌ఏ అనేక ఇతర దేశాలతో కలిసి ఈ నెల 24న ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ నగరంలో 5వ ప్రపంచ కాంగ్రెస్‌ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఎన్‌ఎఎస్‌డిపి సెక్రటరీ జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ విజయకృష్ణకు నైట్ హుడ్, అత్యున్నత బిరుదు ’సర్’ ను ప్రదానం చేశారు. మిలిటరీ ఆర్ట్, హ్యూమన్ సర్వీస్‌లో గౌరవ డాక్టరేట్, పిహెచ్‌డితో సత్కరించారు. ఆర్బిట్రేషన్, శాంతి మధ్యవర్తిత్వానికి సహచరుడిగా గుర్తించారు. పౌర హక్కుల సంరక్షకుడు బిరుదుతో గౌరవించారు. నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని చిత్ర పరిశ్రమలో తన స్వర్ణోత్సవ జరుపుకున్న డాక్టర్ నరేష్ విజయకృష్ణకు ఇది మరో అరుదైన గౌరవం.