Wednesday, January 22, 2025

ముగిసిన నవదీప్ విచారణ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్‌పై నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆధారాలు ముందు పెట్టి అడిగిన ప్రశ్నలకు నవదీప్ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియగానే నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సినీ నటుడు నవదీప్‌ను ఏ29గా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఉన్నారు. వారి వద్ద నుంచి సినీనటుడు నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. సప్లయర్ రామచందర్ పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41 ఏసీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు హైకోర్టు సూచించింది.

కోర్టు ఆదేశాల మేరకు నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్‌కు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. దీంతో నార్కోటిక్ బ్యూరో అధికారుల ఎదుట నవదీప్ శనివారం హాజరయ్యారు. ఉదయం విచారణకు హాజరైన నవదీప్‌ను పోలీసులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం పోలీసులు నవదీప్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం బయటికి వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల కిందటి కాల్ లిస్ట్‌ను నవదీప్ ఎదుట పెట్టి పోలీసులు విచారణ చేసినట్లు తెలిపారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో తనను విచారించారించరని తెలిపారు. టీఎస్ నాబ్ అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, టీఎస్ నార్కోటిక్ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉన్నదని పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారని, బిపిఎం క్లబ్‌తో తనకు ఉన్న సంబంధాలపై వివరాలు అడిగారని తెలిపారు. తన నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు నోటీసులు ఇచ్చారని, తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు.

ఎపిలోని విశాఖకు చెందిన రామచంద్ దగ్గర నేను డ్రగ్స్ కొనలేదని, రామచంద్ తన మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలు డ్రగ్స్‌కు సంబంధించినవి కావని, గతంలో పబ్ నిర్వహించినందుకే నన్ను విచారించారని చెప్పారు. గతంలో తనను సిట్, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణలో నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారన్నారు. నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారన్నారు. నవదీప్ మొబైల్ వాట్సాప్ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారించనున్నట్లు తెలిసింది. నవదీప్ నుంచి డ్రగ్స్ సినీపరిశ్రమలోని మిగతా వారికి సరఫరా అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒప్పుకుంటే శాంపిల్స్…
్ర డగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్ ఒప్పుకుంటే అతడి నుంచి పోలీసులు శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది, వాటిని పరీక్షలకు పంపి రిపోర్టు వచ్చాక డ్రగ్స్ వాటినట్టు తేలితే రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కానీ గతంలో కోర్టులు ఓ వ్యక్తి వద్ద నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించడం మానవహక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అనుమానం ఉన్న వారి అనుమతి తీసుకున్న తర్వాతే శాంపిల్స్ సేకరిస్తున్నారు.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News