Saturday, April 12, 2025

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

తెలుగు, తమిళ సినిమాల్లో ప్రేక్షకాదరణ పొందిన టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర అప్ కమింగ్ బైలింగ్వల్ థ్రిల్లర్ ‘లెవెల్’ లో లీడ్ రోల్ లో నటించా రు. గతంలో సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజావతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజల్స్ దర్శకత్వం వహించి న ఈ చిత్రం మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వేసవిలో మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఒక ఇంటెన్స్ కథనాన్ని చూపిస్తోంది. నవీన్ చంద్ర, శశాంక్, ఆడుకలం నరేన్ పోలీసులుగా, ము సుగు ధరించిన వ్యక్తి ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ ఆసక్తిని పెంచుతోంది. సిల నేరంగలిల్ సిల మణిధర్గల్‌లో నటించిన రేయా హరి, ఎలెవెన్‌లో కథానాయికగా నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News