Saturday, January 25, 2025

సినీ హీరో నవీన్‌రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : కంపెనీ ఆస్తులను తనపేరుపై మార్చుకున్న సినీ హిరో నవీన్ రెడ్డిని సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా, నడిగూడెం మండలానికి చెందిన నవీన్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి ఎన్ స్కేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. అందులో డైరెక్టర్‌గా కొనసాగుతున్న నవీన్‌రెడ్డి అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఒక్కసారిగా అత్యాశపుట్టిన నవీన్ రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను తన పేరుపై మార్చుకోవాలని ప్లాన్ వేశాడు. మిగతా డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి తన పేరుపై కంపెనీకి చెందిన ఆస్తులు మార్చుకున్నాడు.

దాదాపుగా రూ.55కోట్ల విలువైన ఆస్తులను నివీన్‌రెడ్డి తన పేరుపై మార్చుకున్నాడు. కొద్ది రోజులకు అసలు విషయం తెల్సుకున్న మిగతా డైరెక్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సినీ హీరో నవీన్‌రెడ్డిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకి పంపించారు. గతంలో నవీన్‌రెడ్డి బైక్ చోరీ కేసు పోలీసులు నమోదు చేశారు. చీటింగ్ చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడని తెలిసింది. అక్రమ డబ్బుతోనే నవీన్ రెడ్డి ‘నోబడి’ అనే తాను హీరోగా నటిస్తూ సినిమా తీశాడు. నిందితుడిపై పోలీసులు 420, 465, 468, 471, 34 ఐపీసీ కింద కేసులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News