Friday, December 20, 2024

షూటింగ్ లో హీరో నితిన్ కు గాయాలు..!

- Advertisement -
- Advertisement -

లవర్ బాయ్ నితిన్.. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో హీరో నితిన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో నితిన్ కు గాయాలయ్యాయట. ఆయన చేతికి స్వలంగా గాయం కావడంతో వెంటనే చిత్రీకరణ క్యాన్సిల్ చేసి ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారట. దీంతో వైద్యులు రెండు మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోవాలని నితిన్ కు సూచించారట. అయితే, దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News