Wednesday, February 26, 2025

ఇది చిన్నపిల్లల కొట్లాట … హిందీ వివాదంపై విజయ్

- Advertisement -
- Advertisement -

చెన్నై :హిందీ భాష విషయంలో రాష్ట్ర డిఎంకె, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై తమిళగ వెట్రి కళగం (టివికె ) అధ్యక్షుడు , నటుడు విజయ్ తాజాగా స్పందించారు. ఇది చిన్నపిల్లల కొట్లాటలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీవీకే తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి), త్రిభాష సూత్రం అమలుపై ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డిఎంకె, బీజేపీ రెండూ పెద్ద పార్టీలైనా సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

వారి వివాదం చిన్న పిల్లల కొట్లాటలా ఉంది అని ఎద్దేవా చేశారు. డీఎంకే వ్యతిరేకిస్తున్న త్రిభాషా విధానాన్ని విజయ్ కూడా వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. త్రిభాషా సూత్రం అమలును అంగీకరించకపోతే రాష్ట్రానికి రావలసిన రూ.2400 కోట్ల నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరించడంపై తీవ్రంగా స్పందించారు. కేంద్రం తీరును తప్పు పట్టారు. బీజేపీ, డీఎంకే నిజాయితీ లేని పార్టీలని దుయ్యబట్టారు. వారిని అధికారం నుంచి దించేయడమే మేలని , గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టి వారిని సాగనంపడమే లక్షంగా కలసికట్టుగా కృషి చేద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News