Monday, January 20, 2025

బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనమ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వ్యక్తిగత సిబ్బంది పోస్టు చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.‘ఈ ఉదయం మాకు చాలా కఠినమైంది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను.ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవలసి ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో ‘ నషా’తో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు.

పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన రియాల్టీ షో ‘ లాకప్’ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. ఇదే ఆమె పాపులారిటీ పెరగడానికి కారణమయింది. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ది జర్నీ ఆఫ్ కర్మ. అయితే సినిమాలకన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆమె పాపులర్ అయింది. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్ చాలా పాపులర్ అయ్యారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానంటూ ఆమె చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News