Thursday, January 16, 2025

ప్రభాస్ కాలికి స్వల్ప గాయం

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలికి స్వల్ప గాయమైంది. సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడినట్లు తెలిసింది. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో వచ్చే నెల జపాన్‌లో విడుదల కానున్న కల్కి ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జపాన్ అభిమానుల కోసం ఓ పోస్టును విడుదల చేశారు. “నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. కానీ మీరు నన్ను క్షమించాలి.

మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయం కావడంతో జపాన్‌కు రాలేకపోతున్నా”అని ప్రభాస్ పేర్కొన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే నెల 3న ’కల్కి’ జపాన్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ ’ది రాజా సాబ్’ సినిమాతో పాటు హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. ఇక సలార్ 2, స్పిరిట్, కల్కి 2 సినిమాల షూటింగ్‌లలో పాల్గొననున్నారు. అయితే ’ది రాజా సాబ్’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News