Sunday, December 22, 2024

‘డియర్ సుప్రీం లీడర్.. హైదరాబాద్ కు స్వాగతం’..

- Advertisement -
- Advertisement -

Actor Prakash Raj satires on Modi

మన తెలంగాణ/హైదరాబాద్ : విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ సుపరిచితం. ఇటీవలి కాలంలో కేసీఆర్ తో కలిసి బిజెపి వ్యతిరేక కూటమికి తోడ్పాటునందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్‌కు రానున్న మోడీ మీద పరోక్షంగా విరుచుకుపడ్డారు. రాజకీయనేతగా మారిన ఈ నటుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. తెలంగాణలో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ సహా బిజెపి జాతీయ నేతలు, ఇతర నేతలంతా హైదరాబాద్ కు చేరుకుంటున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో మోడీ మీద సెటైర్లు వేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయుడికి స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైతం ఇందులో ప్రస్తావించారు. మోడీ పర్యటనకు వస్తున్నాడంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నారని ఇవన్నీ ప్రజలు కట్టిన పన్నుల నుంచి తీస్తారన్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని, అందుకే ఈ అభివృద్ధి ఫలాలను మీరు కూడా మీ పర్యటనలో ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలను ఎలా అందించాలో తెలంగాణ చూసి నేర్చుకోవాలని పరోక్షంగా నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనితోపాటు సీఎం కెసిఆర్ ఫోటో, కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాల తో కూడిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News