Monday, December 23, 2024

నటి రిచా చద్దాకు ప్రకాశ్ రాజ్ మద్దతు

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ… విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె ట్వీట్‌ను మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ్, అక్షయ్ కుమార్ తప్పు పట్టారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు భారత సేనను ఉద్దేశిస్తూ ‘గల్వాన్ సేస్ హై’ అన్న ఆమె ట్వీట్ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. 2020 గల్వాన్ పోరాటంలో అనేక మంది భారతీయ సైనికులు చనిపోయారన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నటుడు అక్షయ్ కుమార్ ‘ఇలా, నీ నుంచి ఎదురు చూడలేదు’ అని మొదట అన్నప్పటికీ, తర్వాత మరో ట్వీట్‌లో ‘అవును మేము నీ వైపు నిలబడ్డాము’ అని కూడా మద్దతు ఇచ్చాడు. నటుడు అనుపమ్ ఖేర్ అయితే రిచా చద్దా మీద తన ఆక్రోశాన్ని అంతా వెళ్లగ్రక్కుతూ ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. అక్షయ్ కుమార్‌ను తప్పుపడుతూ ‘మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మన దేశానికి సరైనది, మాటవరసకి అంటున్నా’ అని ట్వీట్ చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News