Monday, December 23, 2024

టివి నటుడిని రహస్యంగా పెళ్లాడిన నటుడు రాజ్‌కిరణ్ కూతురు!

- Advertisement -
- Advertisement -

RajKiran daughter Priya

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత రాజ్ కిరణ్ పెంపుడు కూతురు రహస్యంగా ఓ టివి నటుడిని పెళ్లాడింది. దానిపై ఆయన దుమదుమలాడుతున్నారు. రాజ్ కిరణ్, జ్యోతి అనే మహిళను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. కుమారుడు నైనార్ ముహమ్మద్, కూతురు జీనత్ ప్రియ. కాగా జీనత్ ప్రియ టెలివిజన్ నటుడు మునీశ్ రాజాను (‘నాదస్వరం’ ఫేమ్) గుళ్లో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అంతేకాక వారు తమ పెళ్లిని రిజిస్టర్ కూడా చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని నటుడు రాజ్ కిరణ్ ఆమోదించకుండా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. మునీశ్ రాజా బ్యాక్‌గ్రౌండ్ కూడా చిన్నదేమి కాదు. అతడు ‘విరుమంది’ ఫేమ్ నటుడు షణ్ముఖరాజన్‌కు తమ్ముడు. అయితే ఈ పెళ్లి విషయంలో పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి ఎలాంటి ఆక్షేపణలు లేవని తెలిసింది.

ఈ నేపథ్యంలో నటుడు రాజ్‌కిరణ్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు. “ వాస్తవానికి ఆమె నా రక్తం పంచుకు పుట్టిన కూతురు కాదు. నాకు పుట్టింది ఒకే ఒక్క కుమారుడు. అతడి పేరు టిప్పు సుల్తాన్ అలియాస్ నైనార్. అయితే ప్రియ అనే ఆమెను పెంచుకున్నాం. బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆమెను పెంచుకున్నాం. కానీ ఆమె ఓ టివి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాస్తవానికి ఆమె తక్కువ కులం లేదా ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించి ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసేవాళ్లం. కానీ డబ్బు కోసం మోసాలకు పాల్పడే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అందువల్ల వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు”అని ఫేస్‌బుక్ ఖాతాలో గురువారం పోస్ట్ పెట్టారు.

Raj Kiran family

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News