Sunday, January 19, 2025

రాజ్‌తరుణ్ ప్రేమ కేసులో బిగ్ ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

నటుడు రాజ్‌తరుణ్ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్లు క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న ప్రియురాలు లావణ్య ఇపు్పుడు మరో షాకింగ్ న్యూస్ పోలీసులకు చెప్పారు. పదేళ్లుగా తాము గుట్టుగా కాపురం చేస్తున్నామని కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ కూడా అయిందన్నారు. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపించారు. నార్సింగి పోలీసుల కు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అన్ని ఆధారాలూ సమర్పించినట్లు నటి లావణ్యవెల్లడించారు. 170కి పైగా ఫొటోలు, మెడికల్ రిపోర్టులు పోలీసులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నటి మాల్వి మల్హోత్రా తోపాటు ఆమె సోదరుడిపై మొదటి ఫిర్యాదు చేశానని, నటుడు రాజ్ తరుణ్ తనను వాడుకొని మోసం చేశాడంటూ బుధవారం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నటి లావణ్య మాట్లాడుతూ ‘2023 సెప్టెంబర్‌లో రాజ్ తరుణ్‌కి నాకు మధ్య గొడవ జరిగింది.

ఆ సమయంలో నన్ను రెచ్చగొట్టి ఆడియోలు రికార్డు చేశాడు. నేను తిట్టిన ఆడియోలు మాత్రమే ఎడిట్ చేసి రాజ్ తరుణ్ బయటకు వదిలాడు. ఆవేశం, బాధ, కోపంలో మాట్లాడిన మాటలను ఉద్దేశపూర్వకంగా రికార్డు చేశాడు. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయిన ఇరికించారు. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరి వ్యవహారంపై అన్ని ఆధారాలు ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా వాళ్లిద్దరూ చెన్నైలోని ఓ హోటల్లో బస చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాను. నా రాజ్ తరుణ్ నాకు కావాలి. చనిపోయేంత వరకూ న్యాయ పోరాటం చేస్తా. అతని వల్ల గర్భం దాల్చాను. కొన్ని కారణాలతో వల్ల అది మిస్ క్యారీ అయింది. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం నార్సింగి పోలీసులకు అందజేశా‘ అంటూ బాధను వెల్లగక్కారు.

పరస్పర ఫిర్యాదులు…సైలంట్‌గా రాజ్ తరుణ్
లావణ్యపై కూడా నటి మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో మాల్వీ కంప్లెయింట్ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వాళ్లతో తనకు ఫోన్‌లు చేసి బెదిస్తోందని, అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ వైపు లావణ్య వరుస ఫిర్యాదులు ఆరోపణలు, మరోవైపు మాల్వీ కూడా ఫిర్యాదులు చేస్తోంది. కానీ ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌తరుణ్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. వివాదం తెరపైకి వచ్చిన రోజు ప్రెస్‌మీట్ పెట్టి అన్నింటికీ తన లాయర్ ద్వారా పోలీసులకు వివరిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఏం జరగనట్టు సైలెంట్‌గా ఉండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News