Monday, January 20, 2025

నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గాయత్రి అంత్యక్రియలు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం జరగనున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఆకస్మిక మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News