Sunday, December 22, 2024

శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: నటుడు రాజేంద్ర ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టు వస్త్రాలతో సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్ 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇటీవలి ‘కల్కి’ సినిమా వరకు అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్వామి వారి అనుగ్రహంతోనే మంచి పాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నారు. ప్రస్తుతం రవితేజ, నితిన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉందని, మరో సినిమా ‘హరికథ’ పేరుతో స్వామి వారిపై వస్తున్న చిత్రంలో నటిస్తున్నానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News