చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను సోమవారం సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును రజనీ స్టాలిన్ కు అందజేశారు. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. “కరోనాను కరోనాను అరికట్టడానికి, నేను సిఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షలు విరాళంగా ఇచ్చాను. కరోనాను అధిగమించడానికి ప్రభుత్వం ఇచ్చిన నియమనిబంధనలు ఏమైనా ప్రజలు పాటించాలి” అని రజనీకాంత్ అన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి తమిళనాడులో కొత్తగా 12,450 కోవిడ్ -19 కేసులు, 20,905 రికవరీలు, 303 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,07,789 గా ఉందని మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కొత్త మరణాలతో సంఖ్య 17,359కి పెరిగిందని అధికారులు వెల్లడించారు.
Actor Rajinikanth handed over Rs 50 lakhs for Covid