Monday, January 27, 2025

‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటడు రాజ్ కుమార్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో సినీ నటుడు రాజ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా బావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో ఇన్స్పైర్ చేసిందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి దీన్ని ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. నా వంతుగా వీలైనంత ఎక్కువ మందిని బాగస్వామ్యం చేస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని రాజ్ కుమార్ తెలిపారు.

Actor Rajkumar plant saplings in Jubilee Hills Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News