Monday, January 20, 2025

నటుడి పాన్ కార్డు దుర్వినియోగం!

- Advertisement -
- Advertisement -
RajKumar Rao
అతడి క్రెడిట్ రేటింగ్ కూడా పతనం

ముంబయి: నటుడు రాజ్‌కుమార్ రావు(37) పాన్ కార్డు దుర్వినియోగానికి బలయ్యాడు. అతడి పేరిట ఎవరో రుణం తీసుకున్నారు. మోసం జరిగిందని, తన క్రెడిట్ స్కోర్ దెబ్బతిన్నదని, ఈ విషయం పరిశీలించాలని అతడు క్రెడిట్ ఇన్ఫార్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్(సిఐబిఎల్) అధికారులను కోరాడు. “మోసగాడు నా పాన్ కార్డ్‌ను దుర్వినియోగం చేశాడు. నా పేరిట చిన్న మొత్తం.. రూ.2,500 రుణంగా తీసుకున్నాడు. దాని వల్ల నా సిబిల్ స్కోర్ దెబ్బతిన్నది. సిబిల్ అధికారి దీనిని సరిచేయడమేకాక, దీనికి ముందస్తు చర్యలు చేపట్టాలి” అతడు ట్వీట్ చేశాడు. కాగా సిబిల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఆ నటుడికి ఇంకా జవాబు అందాల్సి ఉంది. రాజ్‌కుమార్ రావు ఈ ఏడాది రిలీజ్ అయ్యే ‘హిట్’, ‘ఓ మై డార్లింగ్’, ‘భీడ్’ సినిమాల్లో నటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News