Monday, January 20, 2025

జర్నలిస్ట్‌ను కంగు తినిపించిన నటుడు రణ్‌వీర్ సింగ్

- Advertisement -
- Advertisement -

అబుదాబి: అబుదాబిలో జరిగిన ఫార్మలా వన్ రేసులో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఓ జర్నలిస్టును కంగు తినిపించాడు. జర్నలిస్ట్ మార్టిన్ బ్రండిల్ అతడిని చూసి ఓ కార్ రేసింగ్ అభిమాని అనుకున్నాడు. రణ్‌వీర్ ఉత్సాహంగా మాట్లాడుతుండడం చూసి అతడు ఆయనని ‘మీరెవరు?’ అని ప్రశ్నించాడు. దానికి ఆయన “నేను బాలీవుడ్ నటుడ్ని. ముంబై నుంచి వచ్చాను. ఓ ఎంటర్‌టెయినర్‌ని’ అని జవాబిచ్చి అక్కడి నుంచి నిష్క్రమించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఫార్ములా వన్ రేసులకు రణ్‌వీర్ సింగ్ ‘ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్’ గా హాజరయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News