Sunday, March 30, 2025

స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

కన్నడ నటి హర్షవర్ధని రన్య అలియాస్ రన్యా రావుకు బంగారం స్మగ్లింగ్ కేసులో బెంగళూరులోని సెషన్స్ కోర్టు గురువారం బెయిల్‌ను నిరాకరించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం బంగారం కొనుగోలుకు రన్యారావు హవాలా ఛానెల్స్‌ను ఉపయోగించింది. దీనికి ప్రతిస్పందనగా, అధికారులు న్యాయ దర్యాప్తు ప్రారంభించాలని నోటీసు జారీ చేశారు, ఇది మరిన్ని ఆర్థిక అవకతవకలను వెలికితీస్తుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ కేసులో ఆమె సహాయకుడు, నటుడు తరుణ్ రాజ్ కూడా రెండో నిందితుడిగా ఉన్నాడు. రన్యా రావు అక్రమంగా తరలించిన బంగారాన్ని సహిల్ జైన్ అనే వ్యాపారికి అప్పగించేదని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాపారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) బుధవారం అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య మూడుకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News