Saturday, November 16, 2024

రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సృష్టికర్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నిందితుడు దక్షిణాదిలో అరెస్టు
ఢిల్లీకి తీసుకువచ్చిన పోలీసులు
అతనిపై సాగుతున్న విచారణ

న్యూఢిల్లీ : ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సందర్భంగా తాము ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిలీ పోలీసులు శనివారం వెల్లడించారు. ఆ వీడియో సామాజిక మీడియాలో విస్తృతంగా పంపిణీ అయింది. ఆ వీడియో సృష్టికర్తగా భావిస్తున్న నిందితుని దక్షిణాదిలో అరెస్టు చేసి, ఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారి ఒకరు తెలియజేశారు.

భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) సెక్షన్లు 465 (ఫోర్జరీకి శిక్ష), 469 (ప్రతిష్ఠకు హాని కలిగించేందుకు ఫోర్జరీ), భారత ఐటి చట్టం సెక్షన్లు 66సి, 66ఇ కింద ఎఫ్‌ఐఆర్‌ను ఈ నెల 10న ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్‌లోని ఇంటలిజెన్స్ ఫ్యూజన్, వ్యూహాత్మక కార్యకలాపాలు (ఐఎఫ్‌ఎస్‌ఒ) విభాగంలో నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే ఐఎఫ్‌ఎస్‌ఒ విభాగం నిందితుని గుర్తింపు కోసం యుఆర్‌ఎల్, ఇతర వివరాలు సంపాదించవలసిందిగా మెటాకు లేఖ రాసిందని, వీడియో తీసిన నిందితుడు సామాజిక మీడియాలో ప్రచారంలోకి తెచ్చాడని అధికారులు తెలిపారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News