Monday, January 27, 2025

‘చక్ దే ఇండియా’ ఫేమ్ రియో కపాడియా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘చక్ దే ఇండియా’ ఫేమ్ రియో కపాడియా గురువారం కన్నుమూశారు. ఆయన మిత్రుడు ఫైసల్ మాలిక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన వయసు 66 ఏళ్లు. గత ఏడాది కాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కపాడియాకు భార్య మారియా ఫరా, ఇద్దరు పిల్లలు అమన్, వీర్ ఉన్నారు. కాగా కపాడియా అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు గోరెగావ్‌లోని శివధామ్ శ్మశాన వాటికలో జరుగుతాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.

రియో కపాడియా అనేక బాలీవుడ్ హిట్ చిత్రాల్లో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. దిల్ చాహ్తాహై, చక్ దే ఇండియా ,హ్యాపీ న్యూ ఇయర్ వంటి హిట్ చిత్రాల్లో రియో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాకుండా టీవీలోను ఆయన చిరపరిచితుడే. ‘సప్నే సుహానే లడక్‌పన్ కే’ వంటి సీరియళ్లలో ఆయన నటించారు. సిద్ధార్థ్ తివారీదర్శకత్వం వహించినటీవీ సీరియల్ ‘మహాభారత్’లో ఆయన గాంధారీ తండ్రి పాత్రలో నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News