Wednesday, January 15, 2025

బ్యాచ్‌లర్ టూర్‌కి వెళ్తే ఏమవుతుంది?

- Advertisement -
- Advertisement -

Actor Rohan about 7 Days 6 Nights Movie

ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ తో పాటు నూతన హీరో రోహన్ నటించాడు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రోహన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను మంగళం అనే రోల్‌లో కనిపిస్తాను. ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉండే ఒక హైపర్ యాక్టివ్ కుర్రాడిలా అమ్మాయిల విషయంలో మొహమాటం లేకుండా మాట్లాడే వాడిలా కనిపిస్తాను. ఇలాంటి కుర్రాడు తన ఫ్రెండ్‌తో కలిసి ఒక బ్యాచ్‌లర్ టూర్‌కి వెళ్తే అక్కడ ఏమవుతుంది? అనేది సినిమాలో చూస్తారు. సుమంత్ అన్నతో వర్క్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో నేను తెలంగాణ కుర్రాడిగా నటించాను. తెలంగాణ యాస నేర్చుకొని మాట్లాడడం కొత్తగా అనిపించింది. సినిమాలో మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి”అని అన్నారు.

Actor Rohan about 7 Days 6 Nights Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News